Skip to main content

Namaste NRI

పశ్చిమ దేశాలకు పుతిన్‌ వార్నింగ్‌…వెంటనే 

రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలకు అద్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా పుతిన్‌ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నాయని మండిపడ్డారు. తమకు ఈ పొరుగు దేశాలతో ఎలాంటి వైరం లేదన్నన్నారు.  రష్యాపై విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తేయాలని హెచ్చరించారు. ఇలా చేయడంతో ఇరువురి మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం ఉందని అన్నారు.  తమకు ఇలాంటి ఉద్దేశం లేదని అన్నారు. సంబంధాలను ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి అని  అందరూ ఆలోచించాలని, ఎప్పట్లాగే సహకరించుకోవాలని సూచించారు.

Social Share Spread Message

Latest News