Skip to main content

Namaste NRI

రాధే శ్యామ్‌ ట్రైలర్‌ విడుదల

రెబల్‌ స్టార్‌  ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కొత్త సినిమా రాధే శ్యామ్‌. 1970లో జరిగిన అందమైన ప్రేమకథా చిత్రమిది. ముంబైలోని జుహూలో సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. నిమిషం నిడివి గల ఈ ట్రైలర్‌ దర్శకుడు రాజమౌళి వాయిస్‌తో గొప్ప విజువల్స్‌తో కనిపిస్తున్నది. మనం ఆలోచిస్తున్నామని భ్రమ పడతాం, మన ఆలోచనలు కూడా ముందే రాసి పెట్టి ఉంటాయి అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభం కాగా.. చేయి చూసి భవిష్యత్‌ని, గొంతు విని గతాన్ని చెప్పేస్తావా, ప్రేమ విషయంలో ఆదిత్య జోస్యం తప్పు అనే డైలాగ్‌స ఆకట్టుకుంటున్నాయి. ఓడ ప్రమాద సన్నివేశాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో నాయిక పూజా హెగ్డే, దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ పాల్గొన్నారు.  కార్యక్రమం ప్రాంగణంలో జోతిష్యం చెప్పించుకున్నారు ప్రభాస్‌, పూజా హెగ్డే, త్వరలో హైదరాబాద్‌, ఢల్లీి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చిత్ర బృందం తెలిపింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.  చిత్రానికి సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌ ( తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథన్‌ అనూమాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ (హిందీ), కెమెరా: మనోజ్‌ పరమహంసే.

Social Share Spread Message

Latest News