Namaste NRI

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్.. మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి

రాహుల్‌ విజయ్‌, మేఘ ఆకాష్‌ జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు.  రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ శరవేగంగా పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ కోసం యూనిట్‌ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మంచి టీం సపోర్ట్‌తో వేగంగా చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు. గోవా బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం ఉంటుందన్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోందని తెలిపారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. మంచి ప్యాడిరగ్‌ ఆర్టిస్టులతో సినిమా అనుకున్నది అనుకున్నట్లు బాగా వస్తోంది అన్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్‌ తల్లి బిందు ఆకాష్‌ సమర్పిస్తున్నారు. కోట ఫిల్మ్‌ ఫ్యాక్టరీ అండ్‌ ట్రిప్పి ప్లిక్స్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై ఎ.సుశాంత్‌ రెడ్డి, అభిషేక్‌ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్‌ రెడ్డి కథను అందించారు. అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events