Skip to main content

Namaste NRI

రాజయోగం మూవీ టీజర్‌ లాంచ్‌

సాయిరోనక్‌, అంకిత సాహీ, బిస్మి నాస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రాజయోగం. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్‌, వైష్ణవి నటరాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై మణి లక్ష్మన్‌రావు నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్‌గణపతి రూపొందిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత మణి లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందన్నారు. మాటీమ్‌ అందరికీ రాజయోగం తెస్తుందని ఆశిస్తున్నామన్నారు. రెండు గంటలపాటు ఇంటిల్లిపాది నవ్వుకునేలా సినిమా ఉంటుందన్నారు. అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అరుణ్‌ మురళీధరన్‌, హీరోయిన్‌ అంకిత సాహో హీరోయిన్‌ బిస్మి నాస్‌, దర్శకుడు రామ్‌ గణపతి, హీరో సాయి రోనక్‌ తదితరులు మాట్లాడారు. అజయ్‌ ఘోష్‌, ప్రవీణ్‌, గిరి భద్రం షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌, చిత్రం శీను, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  తుది హంగులు హద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్‌ 9న విడుదలకు సిద్ధమవుతోంది.

Social Share Spread Message

Latest News