Skip to main content

Namaste NRI

రామారావు ఆన్‌ డ్యూటీ ఎప్పుడంటే

మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా రామారావు ఆన్‌ డ్యూటీ. దివ్యాంక కౌశిక్‌ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంలో శరత్‌ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని నిర్మించామని, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని కమర్షియల్‌ అంశాలతో సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాత తెలిపారు. రజిషా విజయన్‌, వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేష్‌ వీకే తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ చిత్రాన్ని జూన్‌ 17న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. కొత్త పోస్టర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  ఆ పోస్టర్‌లో రవితేజ సీరియస్‌ లుక్‌లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ట్రక్కులు అడవి గుండా వెళ్లడం కనిపించింది. యాథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది.  ఈ చిత్రానికి సంగీతం : సామ సీఎస్‌, సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌.

Social Share Spread Message

Latest News