Skip to main content

Namaste NRI

రామ్‌కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా సకుటుంబానాం ..షూటింగ్ షురూ

రామ్‌కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం సకుటుంబానాం  ప్రారంభమైంది. ఉదయ్‌శర్మ దర్శకత్వం. హెచ్‌.మహాదేవ్‌ గౌడ, హెచ్‌.నాగరత్నం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం క్లాప్‌నివ్వగా, కొరియోగ్రాఫర్‌ చిన్ని ప్రకాష్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సకుటుంబ కథా చిత్రమిది. కదిలించే భావోద్వేగాలుంటాయి. వినోదానికి పెద్దపీట వేశాం అన్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తను సిరి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, మనసుకు నచ్చిన క్యారెక్టర్‌ చేయడం ఆనందంగా ఉందని కథానాయిక మేఘా ఆకాష్‌ చెప్పింది. క‌థానాయ‌కుడు రామ్‌కిర‌ణ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి క‌థే హీరో. ఈ క‌థ‌ను న‌మ్మి ఇంత మందికి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌కు థ్యాంక్స్‌. అన్ని ఎమోష‌న్స్ వున్న చాలా శ‌క్తివంత‌మైన క‌థ ఇది. ఈ చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంది అన్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య, రాహుల్‌ రామకృష్ణ, రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రోహిత్‌ పద్మనాభం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉదయ్‌శర్మ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events