Namaste NRI

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

రవితేజ తాజా చిత్రం ఇరుముడి నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఆధ్యాత్మిక భావాల్ని ప్రతిబింబించే టైటిల్‌తో తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటమే అందుక్కారణం. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ది హార్ట్‌ ఆఫ్‌ ఇరుముడి పేరుతో గ్లింప్స్‌ను విడుదల చేశారు. కూతురే ప్రపంచంగా బతికే తండ్రీ, వారిద్దరి మధ్య అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ గ్లింప్స్‌ హృద్యంగా సాగింది. అయ్యప్పదీక్ష తాలూకు విజువల్స్‌ భావోద్వేగభరితంగా అనిపించాయి.

యాక్షన్‌ ఎలిమెంట్స్‌ కథపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఓ తండ్రి తాలూకు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఈ గ్లింప్స్‌ హార్ట్‌టచింగ్‌గా సాగింది. ప్రియా భవానీ శంకర్‌, సాయికుమార్‌, బేబీ నక్షత్ర, అజయ్‌ఘోష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events