Skip to main content

Namaste NRI

ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి : అనిల్‌ కూర్మాచలం

హైదరాబాద్‌లో కేటీఆర్ కుటుంబసభ్యులు నూతనంగా నిర్మించుకున్న ఇంట్లో కుటుంబంతా కలిసి ఏర్పాటు చేసుకున్న విందు పార్టీని, రాజకీయ కుట్రలో భాగంగా రేవ్ పార్టీగా చిత్రీకరించడంపై ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం మండిపడ్డారు. ఈ సందర్భంగా అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ  కేటీఆర్ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూడటం పిరికింద చర్య అని ఎద్దేవా చేశారు. ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలు స్వేచ్ఛగా బంధుమిత్రులతో కలుసుకొని వీలు లేకుండా ఒక నియంత పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో మీ వికృత చేష్టలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News