Skip to main content

Namaste NRI

రిషి సునాక్‌  పోటీదారుగా విదేశాంగ మంత్రి లిజ్‌

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేందుకు పోటీలోకి దిగుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.  తాజాగా యూకే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ (46) ప్రవేశించారు. దీంతో అధికార టోరీ పార్టీ ఎంపీల్లో ప్రాబల్యమున్న ఆమె, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు గట్టి పోటీదారు అవుతారని భావిస్తున్నారు. పన్నుల విధింపు అంశంలో ఆమె అభిప్రాయాలు రిషి సునాక్‌కు భిన్నంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ద్రవ్యోల్బణం దిగి వచ్చే వరకు పన్నుల్లో కోత విధించారాదన్నది రిషి సునాక్‌ అభిప్రాయం. తాను ప్రదాని పదవిని చేపట్టిన వెంటనే పన్నుల భారాన్ని తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌ ప్రకటించడంతో రిషితో ముఖా ముఖీ తలపడేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రధాని పదవి బరిలో నిలుస్తున్న వారి సంఖ్య 11కి చేరుకుంది. భారతీయ మూలాలున్న హోంమంత్రి ప్రీతి పటేల్‌ కూడా పోటీ చేసే అవకావం కనిపిస్తోంది. తన తర్వాత ప్రభుత్వానికి ఎవరు సారథ్యం వహించాలో ప్రతిపాదిస్తే అది పోటీలో ఉన్న ఇతరుల అవకాశాలను దెబ్బతీసినటుÊ్ల అవుతుందని త్వరలో ప్రధాని పదవిని వీడనున్న బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News