Skip to main content

Namaste NRI

మరో రౌండ్‌లోనూ  రిషి సునాక్‌ ముందంజ

బ్రిటన్‌ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి, మాజీ మంత్రి రుషి సునాక్‌ మరింత ఆధిక్యం సాధించారు. కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీల తాజా ఓటింగులో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. వాణిజ్య మంత్రి పెన్నీ మెర్డాంట్‌ 82 ఓట్లతో రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ 71  ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కెమి బడెనోచ్‌కు 58 ఓట్లు వచ్చాయి. తదుపరి విడత ఓటింగ్‌ నేడు జరుగుతుంది.  మరో రెండు రోజుల్లో జరిగే ఎన్నికల బరిలో ఇద్దరే మిగులుతారు. ఆ తర్వాత 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్‌ పార్టీ ఓటర్లు పోస్టర్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం బ్రిటన్‌ ప్రధాని రేసులో నలుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు.

Social Share Spread Message

Latest News