Skip to main content

Namaste NRI

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో .. రిషీ సునాక్‌ దంపతులు

శ్రీకృష్ణ జన్మాష్టమి భారతీయులందరూ ఎంతో భక్తి శ్రద్దలతో కృష్ణుడి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా..తన భార్య అక్షతతో కలిసి భక్తి వేదాంత మనోర్‌ ఆలయాన్ని సందర్శించారు బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌.. ఈ సందర్భంగా ఆయన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణుడి పుట్టినరోజున జన్మాష్టమి పేరుతో వేడుకలు నిర్వహిస్తారని, ఆ పాపులర్‌ పండుగ సందర్భంగా తాను గుడికి వెళ్లినట్లు రిషి తెలిపారు. రిషి, అక్షతలు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు.  ఇదిలా ఉండగా బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్‌ ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events