Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌తో యుద్ధంలో భారీ విజయం సాధించిన రష్యా

 ఉక్రెయిన్‌లోని అవ్దివక పట్టణం పూర్తిగా తమ అధీనంలోనే ఉందని రష్యా తెలిపింది. తమ ధాటికి ఉక్రెయిన్ సేనలు అక్కడి నుంచి వైదొలిగాయని, అయితే కొద్ది సంఖ్యలో సైనికులు సోవియట్ కాలం నాటి ఓ బొగ్గు గనిలో దాక్కుని ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది.ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఇరుపక్షాల నడుమ యుద్ధం సాగింది. ఇప్పుడు ఈ పట్టణం పూర్తిగా తమ వశం కావడం తమకు పూర్తిస్థాయి విజయం అని వెల్లడించారు. గత ఏడాది మేలో బక్ముత్ సిటిని స్వాధీనం చేసుకున్న తరువాత తమ దళాలకు పూర్తి స్థాయిలో దక్కిన విజయం ఇదేనని వివరించారు.

Social Share Spread Message

Latest News