Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి

ఉక్రెయిన్‌పై ఇటీవల కాలంలో రష్యా దాడులు మరింతగా పెరిగాయి. రష్యాకు సంబంధించిన బ్రిడ్జిని ఉక్రెయిన్‌ దళాలు కూల్చేయడంతో రష్యా తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడిరది. పశ్చిమాన వోలిన్‌ నుంచి ఆగ్నేయంలోని జపోరిజియా వరకు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తు సౌకర్యాలే లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులు చేసింది. నైరుతిలోని ట్రాన్స్‌ కార్పతియా నుంచి ఈశాన్య దిశలో వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఖార్కివ్‌, ఖేర్సన్‌ వరకు అనేకసార్లు భారీ శబ్దాలు వినిపించాయి.  రష్యా ప్రయోగించిన 18 దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌ రక్షణశాఖ అధికారులు కూల్చేసినట్లు సమాచారం. ఈ దాడులతో ఉక్రెయిన్‌లో కరెంట్‌ లేకుండా పోయింది. 15 లక్షల మంది చీకట్లోనే ఉండిపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు సుమారు 8 నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News