సాయిధరమ్తేజ్ హీరోగా సంపత్నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ మొదలైంది. విశేషమేంటంటే ఈ సినిమాకు గంజాయి శంకర్ అనే పేరు అనుకుంటున్నారంట. ఈ సినిమాలో సాయిధరమ్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తున్నది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజాహెగ్డే కథానాయికగా నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాలో సాయిధరమ్తేజ్ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో ఆవిష్కరించబోతున్నారట దర్శకుడు సంపత్నంది.














