Namaste NRI

సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. శృతి హాసన్ హీరోయిన్.  ఈ చిత్రం సరికొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు. చేతిలో కత్తితో, రక్తం తో ఉన్న ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ తో పాటుగా, పోస్టర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.  ఈ చిత్రం లో పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రానికి నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events