Skip to main content

Namaste NRI

యశోద లో సమంత రియల్‌ యాక్షన్‌

సమంత టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం యశోద. హరి, హరీష్‌ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. యశోద యాక్షన్‌ సీన్స్‌ మేకింగ్‌ వీడియోని విడుదల చేశారు. ఈ సినిమాకి పనిచేసిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్‌ బెన్‌ మాట్లాడుతూ ద ఫ్యామిలీ మేన్‌ 2 వెబ్‌ సిరిస్‌ తర్వాత సమంతతో నా రెండో ప్రాజెక్ట్‌ యశోద. ఫైట్స్‌  ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. యశోద లో స్టంట్స్‌ కూడా రియల్‌గా ఉంటాయి. కిక్‌ బాక్సింగ్‌, జూడో, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌  ఇందులో ఉంటాయి. సమంతతో  పనిచేయడం బాగుంటుంది అన్నారు.  వరలక్ష్మీ శరత్‌కుమార్‌,  ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌ మురళీశర్మ, సంపత్‌రాజు తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, కెమెరా: ఎం.సుకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు రవికుమార్‌ జీపీ, రాజా సెంథిల్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక, సహ నిర్మాత : చింతా గోపాలకృష్ణారెడ్డి,

Social Share Spread Message

Latest News