Skip to main content

Namaste NRI

మాచర్ల నియోజకవర్గం నుండి సముద్రఖని ఫస్ట్‌లుక్‌

నితిన్‌ హీరోగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతి శెట్టి, కేథరిన్‌ కథానాయికలు. ఇందులో రాజప్ప అనే శక్తిమంతమైన ప్రతినాయకుడిగా సముద్రఖని నటించారు. ఆయన పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో ఆయన నెరిసిన జుట్టు.. మెలితిరిగిన మీసం.. నుదిటిన తిలకం.. మెడలో రుద్రాక్షమాలతో సరికొత్తగా కనిపించారు. ఇదొక పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. నితిన్‌ ఐఏఎస్‌ అధికారిగా నటించారు. మాచర్ల నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే రాజప్పగా సముద్రఖని కనిపిస్తారు. ఆయనకు ఆ నియోజకర్గంలో ప్రతిపక్షమే లేదు. అలాంటి ఎమ్మెల్యేకు ఐఏఎస్‌ అధికారికి మధ్య సాగే పోరు ఆసక్తికరంగా ఉంటుంది అని చిత్రవర్గాలు తెలిపాయి.                

ఈ చిత్రాని ఆదిత్య మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్లపై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సంగీతం: మహతి స్వరసాగర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరావు, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల. అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. 

Social Share Spread Message

Latest News