Skip to main content

Namaste NRI

మెటా ఇండియా చీఫ్‌గా సంధ్యా దేవనాథన్‌

ఫేస్‌బుక్‌కు చెందిన మెటా ఫ్లాట్‌ఫామ్ సంధ్యా దేవ‌నాథ‌న్‌ను ఇండియా హెడ్‌గా నియ‌మించింది. మెటా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఇటీవ‌లే మెటా నుంచి అజిత్ మోహ‌న్ వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. వాట్సాప్‌ ఇండియా చీఫ్‌ అభిజిత్‌ బోస్‌, భారతదేశంలోని మెటా ఫ్లాట్‌ఫారమ్‌ల పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌ కూడా ఈ వారం ప్రారంభంలో రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం బిగ్‌టెక్‌ కంపెనీలను నియంత్రించే చట్టాలను కఠినతరం చేయడంతో ఫేస్‌బుక్‌ సంస్థ ఇండియాలో నియంత్రణ సవాళ్లను ఎదుర్కొంటున్నది.

ఫేస్‌బుక్‌పై ప్ర‌స్తుతం ఇండియాలో రెగ్యులేట‌రీ స‌మ‌స్య‌లు ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్న త‌రుణంలో సంధ్యా దేవ‌నాథ‌న్ నియామ‌కం కీల‌కంకానున్న‌ది. ఫేక్ న్యూస్‌, విద్వేష ప్ర‌సంగాల‌ను అరిక‌ట్ట‌డంలో ఫేస్‌బుక్ విఫ‌ల‌మైంది. 2016 నుంచి సంధ్యా దేవ‌నాథ‌న్ మెటాలో ప‌నిచేస్తున్నారు. జ‌న‌వ‌రిలో ఆమె కొత్త బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events