Skip to main content

Namaste NRI

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. స్థానికులకే 

 స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని ఉద్యోగాలను కేవలం స్థానికులకే ఇవ్వాలనే ఉద్దేశంతో మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా ఆరు కీలక నిబంధనలు తీసుకువచ్చింది. కింగ్‌డమ్‌ వ్యాప్తంగా ఉన్న ఏవియేషన్‌, ఆప్టిక్స్‌, కస్టమర్‌ సర్వీస్‌, రెగ్యులర్‌ ఇన్‌స్పెక్షన్‌ యాక్టివిటీస్‌, పోస్టల్‌, పార్మిల్‌ డెలివరీ సర్వీస్‌ల అవుట్‌లెట్‌లలో సౌదీ పౌరులతోనే నియామకాలు చేపట్టాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఆయా రంగాల్లో సుమారు 33 వేల మంది సౌదీ పౌరులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావిస్తోంది. లేబర్‌ మార్కెట్‌లో స్థానికుల సంఖ్యను పెంచడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని సౌదీ చెబుతోంది.

Social Share Spread Message

Latest News