Skip to main content

Namaste NRI

ధూం ధాం సినిమా నుంచి సెకండ్ సింగిల్  మాయా సుందరి.. లిరికల్..

చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ధూం ధాం. సాయికిశోర్‌ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ నిర్మాత.  సాయికుమార్‌, వెన్నెలకిశోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ ఇందులో కీలక పాత్రధారులు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాటను మేకర్స్‌ విడుదల చేశారు. మాయాసుందరి.. హే మాయాసుందరి.. నా మాయాసుందరి.. ఎక్కడున్నావో మరీ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, గోపీసుందర్‌ స్వరపరిచారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. హీరో పాడుకునే ఈ ప్రేమగీతాన్ని దర్శకుడు సాయికిశోర్‌ మచ్చా స్టైలిష్ గా రూపొందించారని నిర్మాత తెలిపారు.  షూటింగ్‌ పూర్త్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: ప్రవీణ్‌వర్మ, కెమెరా: సిద్ధార్థ్‌ రామస్వామి.

Social Share Spread Message

Latest News