Skip to main content

Namaste NRI

దుబాయ్‌ యువరాణి సంచలన ప్రకటన

దుబాయ్‌ యువరాణి షేఖా మహ్రా బిన్త్  మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (30) ఓ సంచలన ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా తన భర్త షేక్ మనా బిన్ హమమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌కి (30) విడాకులు ఇచ్చింది.ఈ జంట తొలి బిడ్డకు జన్మనించిన రెండు నెలలకే విడిపోవడం గమనార్హం. ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను. టేక్‌ కేర్‌ ఇట్లు మీ మాజీ భార్య అంటూ షైఖా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సైతం అకౌంట్ల నుంచి తొలగించారు.

దుబాయి పాలకుడైన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె అయిన యువరాణి షైకా, దుబాయికి చెందిన వ్యాపారవేత్త, కుబేరుడైన షేక్‌ మనా బిన్‌ మహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ను 2023 మే 27న వివాహం చేసుకున్నారు. రెండునెలల కిందట షైకా, మనా దంపతులకు కూతురు జన్మించింది. ఇంతలోనే విడాకులు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

Social Share Spread Message

Latest News