Namaste NRI

బెలారస్‌ అధ్యక్షుడు సంచలన ప్రకటన

బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో సంచలన ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ భీకర పోరు నడుస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధంలో  తమ దళాలు పాలు పంచుకోవడానికి సిద్ధంగా లేవని ఆయన తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తమ దళాలు పాల్గొనవని ప్రకటించారు. ఈ యుద్దంలో తమ సేనలు పాల్గొనలేదని అన్నారు. రష్యాకు మద్దతుగా కూడా సేనలను పంపమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ తర్వాత తదుపరి టార్గెట్‌ ఏంటి అన్న విషయంపై బెలారస్‌ మాట్లాడుతూ పుతిన్‌ విరుచుకుపడేది పక్కనే వున్న మోల్దోవాపై అని అన్నారు. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. యుద్ధం జరుగుతున్న సమయంలో వీరిద్దరూ ఫోనల్లో సంభాషించుకున్న విషయం కూడా తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events