Skip to main content

Namaste NRI

షారుఖ్ ఖాన్ జవాన్ ప్రివ్యూ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ నటిస్తున్న చిత్రం జవాన్‌ పై భారీ అంచనాలేర్పడాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొద‌టినుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. తాజాగా  జవాన్‌ ప్రివ్యూ పేరుతో ఈ చిత్ర‌ టీజర్‌ను విడుదల చేశారు. షారుఖ్‌ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌ ఆద్యంతం హై ఇంటెన్సిటీ యాక్షన్‌తో ఆకట్టుకుంది. ఇందులో షారుఖ్‌ఖాన్‌ భిన్న అవతారాల్లో కనిపించి అభిమానులను మెస్మరైజ్‌ చేశారు. టీజర్‌లో చిత్ర ప్రధాన తారాగణాన్ని మొత్తం పరిచయం చేయడం ఆకర్షణగా నిలిచింది. భారీ యాక్షన్‌ ఘట్టాలు, కన్నుల పండుగ‌గా సాగిన పాటలు, షారుఖ్‌ఖాన్‌ డిఫరెంట్‌ లుక్స్‌తో టీజర్‌ ఆసాంతం ఆసక్తిని పంచింది. అనిరుధ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి  నెగటివ్ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Social Share Spread Message

Latest News