Skip to main content

Namaste NRI

శాకిని డాకిని టీజర్‌ వచ్చేసింది

సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలిమ్స్‌, క్రాస్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై సౌత్‌ కొరియా యాక్షన్‌ కామెడీ చిత్రం మిడ్‌నైట్‌ రన్నర్స్‌కు అధికారిక రీమేక్‌గా నిర్మాతలు డి.సురేష్‌బాబు, సునత తాటి, హ్యున్వూ థామస్‌ కిమ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శాకిని డాకిని.  రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా, నివేదాలను పోలీసు అకాడమీలో ట్రైనీలుగా పరిచయం చేస్తూ శాకిని డాకినీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చాలా అసక్తికరంగా ఉంది. నివేద భోజన ప్రియురాలు కాగా, రెజీనా ఓసీడి సమస్య ఉంది. టీజర్‌లో ఒక క్రిమినల్‌ అమ్మాయి తలపై రాడ్డుతో కొట్టటం, తర్వాత రెజీనా నివేద చేసిన కొన్ని యాక్షన్‌ స్టంట్స్‌ అసలు కథపై ఆసక్తిని పెంచాయి.  టీజర్‌ను బట్టి చూస్తే శాకిని డాకిని ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, బలమైన కథ, డ్రామా కూడిన సినిమా అని అర్థమవుతుంది. రెజీనా, నివేదా పాత్రలు బ్రిలియంట్‌గా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో డేర్‌ డెవిల్స్‌గా కన్పించటం ఆకట్టుకుంది. థ్రిల్లర్‌లను హ్యాండిల్‌ చేయటంలో దిట్ట అయిన దర్శకుడు సుధీర్‌వర్మ. ఈ సబ్జెక్టును డీల్‌ చేయటంలో తనదైన మార్క్‌ చూపించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 16న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌, సంగీతం: నరేష్‌ కుమారన్‌`మైకీ మెక్‌క్లియరీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events