Skip to main content

Namaste NRI

శంకర్‌దాదా మళ్లీ వస్తున్నాడు

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌.  2004లో వచ్చిన ఈ చిత్రం పలు రికార్డులను బ్రేక్‌ చేసింది. చక్కటి సందేశంతో ప్రేక్షకులకు ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన పాటలు చాలా పాపులర్‌ అయ్యాయి. తాజాగా ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న రీరిలీజ్‌ చేస్తున్నారు. మెగా ప్రొడక్షన్స్‌ సంస్థ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అప్పటి వింటేజ్‌ చిరంజీవిని చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలని మెగా ప్రొడక్షన్స్‌ సంస్థ కోరింది. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌  రీరిలీజ్‌ పట్ల మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. నాటి మ్యాజిక్‌ను మళ్లీ తెరపై ఆస్వాదించవొచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News