అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని బేస్‌బాల్ స్టేడియం వెలుపల దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు మృతి చెందారు. వాషింగ్టన్‌లోని నేషనల్స్ పార్క్ బేస్‌బాల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. వాషింగ్టన్ నేషనల్స్, సాన్‌డియాగో జట్ల మధ్య ఆట ప్రారంభమయ్యింది. ఇంతలో స్టేడియం వెలుపల నుంచి కాల్పుల మోత ప్రారంభమయింది. దీంతో కొందరు ప్రేక్షకులకు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఆటగాళ్ల పిచ్‌ను వదిలి వెళ్లిపోయారు.