Skip to main content

Namaste NRI

సార్‌ ఎప్పుడు వస్తారంటే…

ధనుష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సార్‌. ఈ చిత్రంలో సంయుక్త మీనన్‌ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాకి తెలుగులో సార్‌, తమిళంలో వాతి అనే టైటిల్స్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ధనుష్‌ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా రాసుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ఈ చిత్రంలో ధనుష్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపథ్యంగా సాగే చిత్రమిది. సినిమాకు ధనుష్‌ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని మర్చిపోలేను. ప్రస్తుతం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం అన్నారు. సాయి కుమార్‌, తనికెళ్ల భరణి, సముద్ర ఖని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నది. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. సినిమాటోగ్రఫీ: జె యువరాజ్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events