Skip to main content

Namaste NRI

ముగిసిన ఆరో దశ పోలింగ్ 

లోక్‌సభ ఎన్నికల  ఆరో దశలో 59.12 శాతం పోలింగ్‌ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్‌ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ టర్నింగ్ యాప్‌లో అప్‌డేట్ చేసిన గణాంకాల ప్రకారం జార్ఖండ్‌లో 62.66 శాతం, ఒడిశాలో 59.92 శాతం, హర్యానాలో 58.24 శాతం పోలింగ్‌ నమోదైంది.

కాగా, ఢిల్లీలో జరిగిన ఒకే దశ ఓటింగ్‌లో 54.37 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లో 54.03 శాతం, బీహార్‌లో 53.19 శాతం మేర ఓటింగ్‌తో వెనుకబడ్డాయి. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో 51 శాతం పోలింగ్ నమోదైంది.

Social Share Spread Message

Latest News