Skip to main content

Namaste NRI

ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్‌ రాలేదు

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం గేమ్‌ ఆన్‌. దయానంద్‌ దర్శకత్వంలో కస్తూరి రవి నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారని అతిథిగా విచ్చేసిన నిర్మాత వివేక్‌ కూచిభొట్ల అన్నారు. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్‌ రాలేదని, రియల్‌ టైంలో సాగే సైకలాజికల్‌ గేమ్‌గా థ్రిల్‌ను పంచుతుందని హీరో గీతానంద్‌ తెలిపారు. సినిమాలో ప్రతీ సన్ని వేశం కొత్తగా ఉంటుందని, విజువల్‌గా, సంగీతపరంగా మరో స్థాయిలో తీర్చిదిద్దామని దర్శకుడు దయానంద్‌ పేర్కొన్నారు. ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశామని, ప్రేక్షకులకు ప్రెష్‌ఫీల్‌నిస్తుందని నిర్మాత కస్తూరి రవి అన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News