Skip to main content

Namaste NRI

స్విట్జర్లాండ్‌లో చంద్రబాబుకు ప్రవాసాంధ్రుల సంఘీభావం

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు కు  వివిధ దేశాల్లోని తెలుగువారు మద్దతుగా నిలుస్తున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్విట్జర్లాండ్‌లోని తెలుగువారు చంద్రబాబుకు సంఘీభావంగా మేము సైతం బాబు గారి కోసం అని నినదించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు చేసిన సేవ వెలకట్టలేనిదని అన్నారు. అయన వల్ల ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున దేశవిదేశాలలో సెటిల్ అవ్వటమే కాకుండా మరల అయన ఇచ్చిన జన్మభూమి కోసం మేము సైతం అనే నినాదంతో సొంత ఊళ్ళకి విరాళాలు ఇస్తున్నారని తెలిపారు.

ఆంధ్రరాష్ట్రంలో శాంతిభద్రతలు కానీ, పెట్టుబడులు కానీ ఈ సైకో జగన్ పాలనలో ఎప్పటికి రావని స్పష్టం చేశారు. చేతకాని దద్దమ్మకి అధికారం ఇస్తే గంజాయి, మందు, పేకాట ఇవే తాను తెచ్చే గొప్ప పనులు యువతకి, అదే చంద్రబాబు వస్తే పెట్టుబడులు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయని ముక్తకంఠంతో తెలిపారు. సైకో పోవాలి, బాబు గారు రావాలి.. ఆంధ్ర భవిషత్తు బాగుండాలి అని చెప్పారు.

Social Share Spread Message

Latest News