అణ్వాయుధాలను వదులుకొంటే ఆర్థిక సాయం చేస్తామంటూ ఆఫర్ ప్రకటించిన దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ ఘాటుగా స్సందించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం దక్షిణ కొరియా ఆఫర్ అని అభివర్ణించారు. కేవలం తిండి కోసం ఎవరూ వారి లక్ష్యాలను వదులుకోరని పేర్కొన్నారు. దక్షిణకొరియా అధినేత యూన్ సుక్ యేల్ కొంచెం నోరుమూసుకోవాలని హెచ్చరించారు. ఆయనవి అమాయక చర్యలని వాటిని పిల్లచేష్టలతో పోల్చారు.














