Skip to main content

Namaste NRI

ఐస్‌ల్యాండ్‌ లొకేషన్స్‌లో స్పార్క్‌ చిత్రీకరణ

విక్రాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం స్పార్క్‌. ఇది భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. మెహ్రీన్‌ ఫిర్జాదా, రుక్సర్‌ థిల్లాన్‌ ఇందులో హీరోయిన్స్‌, ప్రతి నాయకడిగా మిన్నల్‌ మురళి పేమ్‌ గురు సోమ సుందరం నటిస్తున్నారు. తాజాగా ఐస్‌ ల్యాండ్‌లోని అందమైన లొకేషన్స్‌ లో స్పార్క్‌ సినిమాకు సంబంధించిన రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ పాట ప్రేక్షకులకు కనుల విందు చేయనుంది.  స్పార్క్‌  చిత్రం ద్వారా అరవింద్‌ కుమార్‌ రవి వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవి వర్మ ఇంతకు ముందు సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు.  హృదయం ఫేమ్‌ మేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నాజర్‌, సుహాసినీ మణిరత్నం జాయిన్‌ అయ్యారు. వీరితో పాటు వెన్నెల కిశోర్‌, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events