Skip to main content

Namaste NRI

స్టాండప్‌  రాహుల్‌ ట్రైలర్‌ విడుదల

రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం స్టాండప్‌ రాహుల్‌. కూర్చుంది చాలు అనేది ఉపశీర్షిక. హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌, పాటల్ని విడుదల చేశారు.  దర్శకుడు మాట్లాడుతూ వైజాగ్‌ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ కథ రాసుకున్నప్పుడే నా లైఫ్‌లో చూసిన వారిని ఇందులోకి తెచ్చాను. ఇందులో అలా ఇలా అనేది నా పేవరెట్‌ పాట అన్నారు. రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ వినోదంతో పాటు హృదయాల్ని కదిలించే ఎమోషన్స్‌ ఉంటాయి. ఎంతో ఇష్టంతో కష్టపడి చేసిన సినిమా ఇది. ఇందులో ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. కుటుంబంతో కలిసి వచ్చి రెండు గంటలు హాయిగా ఎంజాయ్‌ చేయండి. తప్పక ఈ చిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. థియేటర్లో చూసి ఎంజాయ్‌ చేయండి అన్నారు నిర్మాతలు. వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, ఇంద్రజ ఇతర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. శాంటో మోహన్‌ వీరంకి దర్శకుడు. నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగలూరి నిర్మాతలు. ఈ సినిమా 18న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events