Skip to main content

Namaste NRI

అమెరికాలో అలాంటి పరిస్థితి  రాదు

అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం లో చిక్కుకుంటుందని భావించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఉద్యోగిత గణాంకాలు ఆశాజనకంగా ఉన్నందున ప్రస్తుత వేగం పుంజుకున్న అభివృద్ధి, స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు కూడా మాంద్యం భయాలను కొట్టిపారేస్తున్నారు. పటిష్టమైన లేబర్‌ మార్కెట్ల వల్ల అలాంటి పరిస్థితి రాదని అంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీలో 1.6 శాతం క్షీణత నమోదైంది. రెండో త్రైమాసికంలో ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశముందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే స్వల్ప వృద్ధి నమోదవుతుందనే విషయంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుసగా రెండో త్రైమాసికంలో జీడీపీ మరింత పడిపోతుందనే అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Social Share Spread Message

Latest News