Skip to main content

Namaste NRI

మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్‌ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో ఈ నెల 7న స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్‌ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా, తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్ మంగళవారం ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి ప్రయోగించనున్నారు.

ఈ సందర్భంగా సునీతా విలియమన్స్‌ మాట్లాడుతూ కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించబోతున్నందున తాను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో ఉత్సాహంగా ఉన్నానన్నారు. నేను ఇంటర్నేషన్‌ స్పేస్‌సెంటర్‌ కేంద్రానికి వెళ్లిన సమయంలో ఇంటికి తిరిగి వెళ్లినట్లుగా ఉంటుందన్నారు.

Social Share Spread Message

Latest News