Skip to main content

Namaste NRI

ముఖ్యమంత్రి కేసీఆర్ కే తమ మద్దతు : టీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది టీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ. ఈ సందర్భంగా టీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ఫౌండర్ శ్యామ్ ఆకుల మాట్లాడుతూ కేసీఆర్తోనే ఈ దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందన్నారు. ఇప్పుడు దేశానికి తెలంగాణ మోడల్ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా.. పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దక్షిణాది నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జయ చందర్ గంట, జనరల్ సెక్రటరీ ప్రసాద్ రావు కలకుంట్ల, వైస్ ప్రెసిడెంట్ విశాల్ వెంకట్ శెట్టి, మహేష్ ఏలేటి, సునీల్ మహాజన్, గూడూరి నవీన్, రాజి రెడ్డి గడ్డం,చందు పల్లె, సురేష్ కట్ట, శ్రీనివాస్ బండారి, సాయి కృష్ణ మిల్కా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News