Namaste NRI

తానా 23వ మహాసభల గ్రాండ్ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ బ్యాంక్వెట్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ( తానా) 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్నారు.   ఇందులో భాగంగా తానా బృందం ఆగష్టు 5న కన్వెన్షన్ సెంటర్‌ ని కూడా సందర్శించడం జరిగింది.

తానా మహాసభలు  పొట్లూరి రవి కన్వీనర్ గా లావు అంజయ్య చౌదరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించనున్నారు.  ముందుగా నవంబర్ 5న ఈ మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ డ ఫండ్రైజర్ బ్యాంక్వెట్  నిర్వహిస్తున్నారు. అదే రోజు  తానా కార్యవర్గసభ్యులు, బోర్డు సభ్యులు మరియు ఫౌండేషన్ సభ్యుల సమావేశాలుంటాయి. సాయంత్రం 7 గంటల నుండి వార్మినిస్టర్ లోని ది ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్లో కిక్ ఆఫ్ కం ఫండ్రైజర్ బ్యాంక్వెట్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగాప్రముఖ తెలుగు సినీ గాయని గీత మాధురి  లైవ్ పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించనున్నారు.

దీంతో ఇండియాలో పెద్ద ఎత్తున నిర్వహించే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలకు ముందుగా ఈ కన్వెన్షన్ కిక్ ఆఫ్ డ ఫండ్రైజర్ బ్యాంక్వెట్ ఈవెంట్లో తానా అతిరథ మహారథులందరూ కలిసే అవకాశం ఉంది. ఈ  కార్యక్రమానికి  అందరినీ ఆహ్వానిస్తూ పర్సనల్ ఫోన్ కాల్స్, ఈవైట్, వన్ ఆన్ వన్ టెక్స్ట్ మెసేజెస్ అందరికీ వెళ్లాయి.  ఇప్పటికే అమెరికాలోని పలు నగరాల నుంచి తానా నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కి హాజరయ్యేలా ఫ్లైట్ మరియు హోటెల్ టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిసింది.  

కోవిడ్   కారణంగా 2021 మహాసభలు రద్దవడంతో సుమారు 4 సంవత్సరాల తర్వాత వచ్చే మహాసభలు కావడంతో ఇటు తానా సభ్యులు అటు తెలుగువారందరూ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.

Social Share Spread Message

Latest News