Skip to main content

Namaste NRI

ఫిలడెల్ఫియాలో తానా మహాసభలు

23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో 2023 జులై 7వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. తానా సైట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అనిల్‌ యలమంచిలి, సభ్యులు పూర్ణ వీరపనేని, రామ్‌ మద్ది బృందం తానా మహాసభల వేదిక కోసం అట్లాంటాతో పాటు పలు నగరాలలోని కన్వెన్షన్‌ సెంటర్స్‌తో చర్చించిన తర్వాత ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ను 2023 తానా మహాసభల వేదికగా సిఫార్సు చేయడం జరిగింది. తానా సైట్‌ సెలక్షన్‌ కమిటీ సిఫార్సు కు తానా కార్యవర్గం, బోర్డు ఆమోదం తెలిపిందని అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల కోఆర్డినేటర్‌గా రవి పొట్లూరిని నియమించినట్లు తెలిపారు.  రీజినల్‌ కోఆర్డినేటర్‌ నుంచి కార్యదర్శి వరకు పలు పదవులు నిర్వహించి, తానా కార్యక్రమాల నిర్వహణలో విశేష అనుభమున్న రవి పొట్లూరి కోఆర్డినేటర్‌గా తానా సభ్యులు, నాయకత్వం, దాతల సహకారంతో తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుపునున్నట్లు అంజయ్య చౌదరి వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News