Skip to main content

Namaste NRI

అంటార్కిటికా ఖండంపై తెలంగాణ శాస్త్రవేత్త

 తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన తాటిపాముల సురేశ్‌ అంటార్కిటికా ఖండంలో భారతదేశం తరపున శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడైన సురేశ్‌ది మల్యాల మండలం పోతారం గ్రామం. స్థానిక సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో 2000లో పదో తరగతి, కరీంనగర్‌లో ఇంటర్మీడియట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, మహారాష్ట్రలోని ధన్‌బాద్‌లో మైనింగ్‌ విభాగంలో పీజీ పూర్తి చేశారు.  మంచు ఖండంలోని భారతి స్టేషన్‌ వద్ద సైస్మిక్‌ అండ్‌ జియోమాగ్నటిక్‌ అబ్జర్వేటరీ ఆవిష్కరణలో భాగంగా అక్కడి ప్రస్తుత (వేసవి కాలం) పరిస్థితులపై శాస్త్రవేత్తల బృందం గత 16 నుంచి అధ్యయనం చేస్తోంది.

Social Share Spread Message

Latest News