Skip to main content

Namaste NRI

మైటా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్స్‌, ఫైన్‌ కంటొమినియంలో అట్టహాసంగా జరిగాయి. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గీతంతో ప్రారంభమయ్యాయి. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అందరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులతో పాటుగా భారీ సంఖ్యలో ప్రవాసీయులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో  ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులను, 60 ఏండ్ల పోరాట చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభ మైన మలేషియా తెలంగాణ అసోసియేషన్ కూడా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో త్వరలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు మూడు రోజుల పాటు జరపడానికి సన్నాహాలు ప్రారంభిస్తుందని తెలిపారు. మైటా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ మలేషియా అధ్యక్షులు చిట్టి బాబు, ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, సెక్రటరీ సందీప్ కుమార్, ట్రేజరర్ మారుతి, జాయింట్ ట్రేజరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సంతోష్, రవి వర్మ, కృష్ణ వర్మ, హరి ప్రసాద్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి,  ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, దివ్య, సాహితి, సాయిచరణి, ఇందు, మైగ్రెంట్ వింగ్ మెంబర్స్ సందీప్ గౌడ్, నరేందర్ రెడ్డి, చందు, రామ కృష్ణ, రంజిత్  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events