Skip to main content

Namaste NRI

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి

ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలే ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తూ గ్యాస్‌ లీక్ అయ్యి మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడు కు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ (22) నగరంలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్‌ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని షికాగోకు వెళ్లారు. అయితే ఆమె బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో కారు డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్‌ స్పృహ తప్పారు. గమనించిన కొందరు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ విషయాన్ని అక్కడి జహీరా నాజ్ స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జహీరా నాజ్ మరణం తో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు చదవడా నికి అమెరికా వెళ్లిన తమ కూతురు అర్ధాంతరంగా ఇలా చనిపోతుందని ఊహించలేకపోయామంటూ తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జహీరా నాజ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రసాదంపాడులో విషాద చాయలు అలముకున్నాయి.

Social Share Spread Message

Latest News