Skip to main content

Namaste NRI

భూతద్ధం భాస్కర్ నారాయణ కు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు

శివ కందుకూరి హీరోగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ భూతద్దం భాస్కర్‌నారాయణ. పురుషోత్తంరాజ్‌ దర్శకుడు. స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో  శివ కందుకూరి మాట్లాడుతూ సినిమా హిట్‌ అవ్వాలనే కోరిక మా టీమ్‌లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్‌ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్‌ అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ఇది థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా అనీ, అందరూ థియేటర్లలోనే సినిమా చూడాలని చెప్పారు.   ఊహించిన దానికంటే గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలని, ఇంత మంచి టీమ్‌లో భాగం అవ్వడం తన అదృష్టమని హీరోయిన్‌ రాశీసింగ్‌ ఆనందం వెలిబుచ్చింది. కంటెంట్‌ ఉన్న కథలను ప్రేక్షకులు ఎప్పడూ ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైందని నిర్మాతలు చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events