Skip to main content

Namaste NRI

అదేమీ పెద్ద సీక్రెట్‌ కాదు.. పుతిన్‌

ట్రంప్‌ టారిఫ్స్‌ వేళ సాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర  లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధినేత పుతిన్‌ తో ప్రధాని మోదీ భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్‌ ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నా రన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీతో జరిగిన సంభాషణ గురించి పుతిన్‌ తాజాగా మీడియాకు వెల్లడించారు. అదేమీ పెద్ద సీక్రెట్‌ కాదని చెప్పుకొచ్చారు.

చైనా పర్యటన అనంతరం మీడియాతో పుతిన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీతో కారులో సంభాషణ గురించి ప్రస్తావించారు. అదేం పెద్ద సీక్రెట్‌ కాదన్నారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన చర్చల గురించి మోదీకి వివరించినట్లు చెప్పుకొచ్చారు. అలస్కాలో ట్రంప్‌తో కలిసి కారులో ప్రయాణించిన సమయంలో 30 సెకన్లు మాత్రమే మాట్లాడుకున్నట్లు చెప్పారు. బ్రోకెన్‌ ఇంగ్లీష్‌లోనే తన సంభాషణ జరిగిందని వివరించారు. ట్రంప్‌ ఆరోగ్యంగా ఉండటం చూసి సంతోషంగా ఉన్నానని అతనితో చెప్పినట్లు పుతిన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

Social Share Spread Message

Latest News