Skip to main content

Namaste NRI

శ్రీవిష్ణు చేతుల మీదుగా ఆరంభం ఫస్ట్ లిరికల్ సాంగ్

మోహన్‌భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆరంభం. అజయ్‌ నాగ్‌.వి దర్శకుడు. అభిషేక్‌ వీటీ నిర్మాత. ఈ సినిమాకు చెందిన తొలి లిరికల్‌ సాంగ్‌ను హీరో శ్రీవిష్ణు చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కి  శ్రీవిష్ణు శుభాకాంక్షలు అందించారు. అనగా అనగా  అంటూ సాగే ఈ పాటకు స్వరూప్‌గోలీ సాహిత్యం, సింజిత్‌ ఎర్రమిల్లి సంగీతం అందించగా, ఎస్పీ చరణ్‌ ఆలపించారు. ఒక ఊరి నేపథ్యంగా ఆహ్లాదకర సంగీత, సాహిత్యాలతో ఈ పాట రూపొందిందని, త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. లక్ష్మణ్‌ మీసాల, బోడెపల్లి అభిషేక్‌, సురభి ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దేవ్‌దీప్‌ గాంధీ కుందు, మాటలు: సందీప్‌ అంగిడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events