Skip to main content

Namaste NRI

లక్కీ భాస్కర్‌ ప్రారంభం

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం లక్కీ భాస్కర్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వెంకీ అట్లూరి దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూ న్‌ ఫోర్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణం కొలవలేని ఎత్తులకు, ఉన్నత శిఖరాలకు చేరిన వైనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్‌ రవి, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి. ఆర్ట్ డైరెక్టర్: వినీష్ బంగ్లాన్, ఎడిటర్: నవీన్ నూలి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.

Social Share Spread Message

Latest News