అమెరికాలో ఓ దుండగుగు కాల్పులతో చెలరేగిపోయాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, ఒకరు గాయపడ్డారు. పోలీసు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. వాషింగ్టన్‌లోని ఫిన్లే ప్రాంతంలో దహనాలు, కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో తాము అక్కడి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తాము వవ్చేసరికి అక్కడ రెండు ఇళ్లు మంటల్లో చిక్కకొని ఉన్నాయన్నారు. ఆ తర్వాత దుండగుడు బెంటన్ కౌంటీలో పలు ఇళ్లకు నిప్పంటించినట్లు చెప్పారు. అనంతరం అతడు వెస్ట్ రిచ్‌ల్యాండ్‌లో ఒక ట్రక్కులో వెళుతున్నట్లు గుర్తించామన్నారు. వాహనం నుంచి అతడు కాల్పులు జరిపాడని, ప్రతిగా తము ఎదురుకాల్పులు జరిపామని వివరించారు. దీంతో ఆ ట్రక్కు మంటల్లో చిక్కుకుందన్నారు. అందులో దుండగుడి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ఉత్తర ఇలినోయిలోని కంకాకీ న్యాయస్థానం వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, ఒకరు గాయపడ్డారు.