Skip to main content

Namaste NRI

రామోజీ రావు మృతిపట్ల సంతాపం ప్ర‌క‌టించిన గేమ్ ఛేంజర్ టీమ్

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్ ఛేంజర్ టీమ్ కూడా సంతాపం ప్ర‌క‌టిం చింది. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ద‌ర్శ‌కుడు శంకర్, న‌టుడు రామ్ చరణ్ సునీల్, త‌దిత‌రులు రామోజీ రావుకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. ఇక రామోజీరావు మృతిప‌ట్ల ప‌లువురు రాజకీయ ప్రముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Social Share Spread Message

Latest News