Skip to main content

Namaste NRI

ఆసక్తి రేకెత్తిస్తున్న ది ఘోస్ట్‌ యాక్షన్‌ ప్రోమో

కింగ్‌ నాగార్జున, దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న చిత్రం ది ఘోస్ట్‌ ప్రోమో విడుదల చేశారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు నాగార్జునని ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్‌గా చూపించనున్నారు. ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రోమో కూడా వెల్లడిరచింది. ఈ యాక్షన్‌ ధ్రిల్లర్‌లో సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఘోస్ట్‌ దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్‌ జి, సంగీతం: మార్క్‌ కె రాబిన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు : మోహన్‌, వెంకటేశ్వర రావు చాల్లగుళ్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events