Skip to main content

Namaste NRI

రిజర్వేషన్ల రద్దు ఆలోచన అప్పుడే.. రాహుల్‌

అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి ఆలోచిస్తామని, ఇప్పుడు భారత్‌లో అందరికీ సమాన అవకాశాలు లేవని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అమెరికా పర్యటన లో భాగంగా వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల జనాభా 90 శాతం ఉందని, కానీ దేశంలోని మొదటి 200 వ్యాపారుల్లో, అత్యున్నత న్యాయస్థానాల్లో, మీడియాలో వీరి భాగస్వామ్యం దాదాపు శూన్యమని రాహుల్‌  పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 78 మంది కార్యదర్శులు ఉంటే వీరిలో ఒకే ఒక్క గిరిజనుడు, ముగ్గురు దళితులు, ముగ్గురు ఓబీసీలు, ఒక్క మైనారిటీ మాత్రమే ఉన్నారని అన్నారు. కులగణన ద్వారానే దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థితిగతులు తెలుస్తాయని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News