Namaste NRI

ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది : నాట్స్‌

తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు ఇక లేరనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) ఒక ప్రకటనలో తెలిపింది. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగువారు ఎప్పటికి మరచిపోలేరని నాట్స్‌ చైర్‌ విమెన్‌ అరుణ గంటి పేర్కొన్నారు. తెలుగుజాతికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఉన్నత విలువలు ఉన్న వ్యక్తిగా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన రాజకీయ నాయకుడిగా కృష్ణంరాజు తెలుగువారికే ఓ స్ఫూర్తిలా నిలిచారని నాట్స్‌ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి తెలిపారు. కృష్ణంరాజు కుటుంబానికి అమెరికాలోని తెలుగు ప్రజల తరపున తమ ప్రగఢ సానూభూతిని తెలిపారు.

Social Share Spread Message

Latest News